: 24 మిలియన్ల మంది ట్వీట్ చేయడం లేదట!
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కు ఆదరణ పెరిగిప్పటికీ చాలామంది ఖాతాలు ప్రారంభించి వదిలేస్తున్నారట. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ కమిషన్ తో కలసి ట్విట్టర్ నిర్వహించిన సర్వేలో తాజాగా కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ట్విట్టర్లో మొత్తం 284 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. వారిలో సుమారు 24 మిలియన్ల మంది అంటే 8.5 శాతం మంది అస్సలు ట్వీట్ చేయడం లేదని తెలిసింది. ఉపయోగకరంగా లేని పలు ఖాతాలు ఉన్నట్టు ట్విట్టర్ పేర్కొంది. ఇక 11 శాతం మంది ట్విట్టర్ వినియోగదారులు థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ ద్వారా ఈ అప్లికేషన్ కు కనెక్ట్ అవుతున్నట్టు వివరించింది.