: కేసీఆర్ నాలుగ్గోడల మధ్య ఉండే రకం కాదు: హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు గోడల మధ్య ఉంటూ, అభివృద్ధిని గాలికి వదిలేసే సీఎం కాదని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేదల సంక్షేమమే ఆయన లక్ష్యమని వివరించారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రజల మధ్య గడిపిన సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్ లో, బుధవారం నాడు కరీంనగర్ లో పర్యటించనున్నారని హరీశ్ రావు తెలిపారు. పేదల అభివృద్ధే ముఖ్యమంత్రి అజెండా అన్నారు. హైదరాబాద్‌లో ఏకలవ్య భవన్ నిర్మాణ ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళతానని, నామినేటెడ్ పదవుల్లో ఎరుకల సంఘం నేతలకు ప్రాధాన్యమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.