: బుధవారం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె
వేతన సవరణ కోరుతూ ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది సమ్మెబాట పట్టనున్నారు. ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. వేతన సవరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నోమార్లు కేంద్రం తమకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని ఆయన విమర్శించారు. కాగా, ఈ సమ్మెలో స్టేట్ బాంక్ అఫ్ ఇండియా సహా పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పాల్గొంటుండటంతో పలు రకాల సేవలకు, లావాదేవీలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి.