: ఉస్మానియా వైద్యుడికి స్వైన్ ఫ్లూ... నిర్ధారించిన వైద్యాధికారులు


తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి ఓ వైద్యుడికీ సోకింది. ఉస్మానియాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యుడికి ఈ వ్యాధి సోకింది. ఈ మేరకు ఉస్మానియా ఆర్ఎంఓ షఫీ కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తెలంగాణ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియాకు రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఈ వ్యాధి బారిన పడిన రోగులు చేరుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియాలో చేరిన స్వైన్ ఫ్లూ బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యుడు సదరు వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News