: తిరుపతి ఉపఎన్నిక ఏకగ్రీవం కానట్టే!


తిరుపతి ఉపఎన్నిక ఏకగ్రీవం కావడం డౌట్ గానే కనిపిస్తోంది. పోటీకి అభ్యర్థిని నిలపరాదంటూ వైకాపా శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూతో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు, ఉపఎన్నికలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీకి దిగరాదనే సంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు పాటిస్తున్నాయి. అయితే, ఇటీవల ఇదే రీతిలో జరిగిన నందిగామ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టింది. కానీ, ఆళ్లగడ్డ ఉపఎన్నికలో మాత్రం అభ్యర్థిని నిలబెట్టలేదు. అయితే, తిరుపతి ఉపఎన్నికలో మాత్రం బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. పార్టీని మళ్లీ జనంలోకి తీసుకెళ్లడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దీంతో, ఈ ఉపఎన్నిక ఏకగ్రీవం కాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News