: సౌతాఫ్రికాలో 'టాటా' పెట్టుబడులపై నిఘా!


టాటా గ్రూప్ సంస్థల నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సేవలందిస్తున్న నియోటెల్ విస్తరణపై ఆ దేశ నియంత్రణా సంఘాలు నిఘా పెట్టాయి. 2006లో ఓ దక్షిణాఫ్రికా సంస్థతో కలసి సంయుక్తంగా స్థాపించిన నియోటెల్ లో టాటాల వాటా క్రమంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ దక్షిణాఫ్రికాలో మొబైల్ తరంగాల సేవలను అందిస్తోంది. దేశ టెలికాం రంగంలో నెంబర్ వన్ గా ఉన్న ప్రభుత్వ రంగ వోడాకాం సంస్థకు నియోటెల్ విస్తరణతో లాభాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో మరింత పెట్టుబడులు పెట్టి మారుమూల గ్రామాలకు సైతం సెల్ ఫోన్ సేవలను అందించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఆందోళన చెందిన వోడాకాం పెట్టుబడిదారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో టాటాలను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేస్తోంది. నియోటెల్ మాత్రం దక్షిణాఫ్రికాలో ఇతర విదేశీ సంస్థల మాదిరే తామూ విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News