: రేపు దావోస్ కు చంద్రబాబు పయనం... వాల్ మార్ట్ తరహా దిగ్గజ కంపెనీలతో భేటీ!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు తెల్లవారుజామున దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు. ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన దావోస్ లోనే నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ఈ సందర్భంగా పలు బహుళజాతి సంస్థలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఏపీకి పెట్టుబడులను రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా దావోస్ వెళుతున్న ఆయన, వాల్ మార్ట్ తరహా 20 దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, అధికారులు ఎస్పీ టక్కర్, అజయ్ జైన్ తదితరులు వెళ్లనున్నారు.