: మరో రెండు రోజుల్లో శశి థరూర్ ను విచారిస్తాం: ఢిల్లీ పోలీసులు


భార్య సునంద పుష్కర్ హత్య కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరోసారి నోటీసులు పంపారు. మరో రెండు రోజుల్లో ఆయనను ప్రశ్నించనున్నట్టు తెలిపారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సి మాట్లాడుతూ, "థరూర్ ప్రస్తుతం సిటీలో లేరు. రేపు సాయంత్రానికి తిరిగివస్తారు. ఆ తరువాత రేపుగానీ, ఎల్లుండిగానీ విచారణ చేస్తాం. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితోనూ మేము మాట్లాడతాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News