: తెలంగాణ ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు


తెలంగాణ ప్రభుత్వ అలసత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫాస్ట్ పథకం జీవోకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మందలించింది. టీఎస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు మూడు సార్లు గడువిచ్చినా, ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. న్యాయస్థానంతో ఇలాగేనా వ్యవహరించేది? అని నిలదీసింది. జీవోలో 1-11-1956 అని ఎందుకు పేర్కొన్నారో స్పష్టం చేయాలని అడిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పాలసీ అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని తెలిపింది.

  • Loading...

More Telugu News