: సికింద్రాబాద్ నుంచి కొత్త రైళ్లు ప్రారంభించిన రైల్వే మంత్రి
సికింద్రాబాద్ నుంచి రెండు కొత్త రైళ్లను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ వీక్లీ ఏసీ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-ఔరంగాబాద్ వయా నాందేడ్ వీక్లీ ఏసీ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభించారు. త్వరలోనే తిరుపతి - షిర్డీ మధ్య కొత్త రైళ్లు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులను పరిష్కరిస్తామని కూడా చెప్పారు. రెండు రాష్ట్రాల్లో రైల్వే లైన్లు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నేతలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రైల్వే పీపీపీ, ఎఫ్ డీఐలపై ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడిన సంగతి తెలిసిందే.