: పాలడుగు అంత్యక్రియలకు డిగ్గీ రాజా!
అనారోగ్యం కారణంగా నేటి ఉదయం తుది శ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు అంత్యక్రియలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హాజరుకానున్నారు. నేటి ఉదయం మరణించిన పాలడుగు అంత్యక్రియలు ఎల్లుండి నూజివీడులో జరగనున్నాయి. రాజకీయరంగ ప్రవేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వస్తున్న పాలడుగుకు పార్టీ అధిష్ఠానవర్గంలో కీలక నేతలతో మంచి సంబంధాలున్నాయి. పలుమార్లు పీసీసీ చీఫ్ పదవి రేసులో పాలడుగు పేరు వినిపించినా, సామాజిక వర్గాల సమీకరణలో ఆయనకు ఆ పదవి దక్కలేదు. అధిష్ఠానంలో మంచి పలుకుబడి ఉన్న నేపథ్యంలో డిగ్గీరాజాతో పాటు పలువురు పార్టీ ప్రముఖులు ఆయన అంతిమసంస్కారానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.