: ‘ఉబెర్’కు మరో షాక్... సేవలు నిలపాలని సౌత్ కరోలినా ఆదేశం!
క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్ దుశ్చర్య ఉబెర్ క్యాబ్ సర్వీసెస్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. భారత్ లో ఆ సంస్థ సేవలు దాదాపుగా నిలిచిపోగా, తాజాగా అమెరికాలోనూ ఆ సంస్థకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే శివ కుమార్ యాదవ్ కామ దాహానికి బలైన బాధితురాలు, అమెరికాలో ఆ సంస్థపై పోరు సాగించేందుకు నిర్ణయం తీసుకోగా, తాజాగా అమెరికా రాష్ట్రం సౌత్ కరోలినాలో తక్షణమే సేవలు నిలిపేయాలని ఉబెర్ కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కంగుతిన్న ఉబెర్, సదరు ఆదేశాలపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది.