: గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృ వియోగం
టీకాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. గత కొంత కాలంగా ఆయన తల్లి సరస్వతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు చిట్యాల మండలం ఊరమడలో జరుగుతాయి. మరోవైపు సుఖేందర్ రెడ్డికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.