: కరాచీలోనే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం!


అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం తిరిగి పాకిస్థాన్ ప్రధాన నగరం కరాచీకి వచ్చాడట. నెల క్రితం ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుకు తరలివెళ్లిన అతడు, నెల తిరక్కముందే తిరిగి కరాచీకి చేరుకున్నాడు. పాక్ నగరం పెషావర్ లోని ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ సైన్యం, తాలిబాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆఫ్ఘాన్-పాక్ సరిహద్దు దావూద్ కు సురక్షితం కాదని ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ భావించింది. దీంతో దావూద్ తిరిగి కరాచీకే వచ్చాడని భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. దావూద్ గ్యాంగ్ లోని కీలక సభ్యులు చోటా షకీల్, అనీస్ ఇబ్రహీంల మధ్య కొనసాగిన ఫోన్ సంభాషణల ఆధారంగా కరాచీలోకి దావూద్ తిరిగి ప్రవేశించాడని భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాలని భావిస్తున్న దావూద్, తన కోసం ఓ చార్టెర్డ్ ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలని పాక్ సర్కారును కోరాడట. తనకు వ్యతిరేకంగా సౌదీ, భారత్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగైన నేపథ్యంలో ప్రత్యేక విమానం కావాల్సిందేనని అతడు పట్టుబట్టాడని షకీల్, అనీస్ సంభాషణలు తెలిపాయి.

  • Loading...

More Telugu News