: సోనాక్షి సిన్హా సోదరుడి పెళ్లికి ప్రధాని నరేంద్ర మోదీ!


బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోదరుడి వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఎంపీ శత్రుఘ్ను సిన్హా, తన కూతురు సోనాక్షి సిన్హాతో కలిసి ఇటీవల ప్రధాని మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిసిన సంగతి తెలిసిందే. తన కొడుకు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకే నాడు సిన్హా కుటుంబం మోదీని కలిసిందట. అంతేకాక తన సోదరుడి వివాహానికి తప్పనిసరిగా రావాలని ఆ సందర్భంగా సోనాక్షి సిన్హా, మోదీని కోరిందట. బాలీవుడ్ నటులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న మోదీ సిన్హా కుటుంబం ఆహ్వానాన్ని మన్నించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం ముంబైలో జరిగిన సోనాక్షి సిన్హా సోదరుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News