: తల్లిపాల విశిష్టత ప్రచారకర్తగా వ్యవహరిస్తా: నందమూరి బాలకృష్ణ
తల్లిపాల విశిష్టపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తల్లిపాల విశిష్టత ప్రచారకర్తగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం హిందూపురంలో శిశు ఆహార చట్టంపై జరిగిన సదస్సులో బాలయ్య ప్రకటించారు. పుట్టిన ప్రతి బిడ్డకు రెండేళ్ల పాటు తల్లిపాలు ఇస్తే, సదరు బిడ్డను భవిష్యత్తులో రోగాలు దరి చేరవని ఆయన పేర్కొన్నారు. తల్లిపాల విశిష్టతకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.