: వోల్వో బస్సులో మంటలు... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వోల్వో బస్సులో కొద్దిసేపటి క్రితం మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ బస్సు నుంచి సురక్షితంగా కిందకు దిగారు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఓ వోల్వో బస్సులో మెదక్ జిల్లా న్యాల్ కల్ మండలం మాడిగి వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. ప్రయాణికులు వెనువెంటనే బస్సు దిగిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.