: రైతుల భూములతో రియలెస్టేట్ వ్యాపారమా?: అంబటి రాంబాబు


రైతుల భూములతో ఏపీ ప్రభుత్వం రియలెస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటోందని... ఇది అత్యంత దారుణమని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని పేరిట సమీకరిస్తున్న వేల ఎకరాల భూమి కేవలం రియలెస్టేట్ వ్యాపారం కోసమే అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పొట్టకొట్టే పని చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులను కేంద్రం నుంచి అడిగే ధైర్యం లేక... రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News