: కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు (75) కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. వెంకట్రావు స్వస్థలం కృష్ణా జిల్లా ముసునూరు మండలం గోగులంపాడు. నూజివీడు శాసనసభ స్థానం నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1968లో యువజన కాంగ్రెస్ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయింది. 1972-78 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 1978లో నూజివీడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కేబినెట్లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వెంకట్రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.