: సొంత జిల్లాలో జగన్ కు షాక్... బీజేపీలో చేరిన వైకాపా నేతలు ‘కందుల’ సోదరులు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలోనే షాక్ తగిలింది. వైసీపీలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతలుగా పేరుగాంచిన కందుల బ్రదర్స్ జగన్ కు షాకిచ్చారు. వైసీపీకి వీడ్కోలు పలికిన కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానందరెడ్డిలు ఆదివారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే సరస్వతమ్మ కూడా బీజేపీలో చేరారు. జిల్లాలో వైఎస్ కుటుంబానికి కొన్నేళ్ల పాటు వైరివర్గంగా కొనసాగుతూ వస్తున్న కందుల సోదరులు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో చేరిన నాటి నుంచి ఆ పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చిన కందుల సోదరులు ఒకానొక సమయంలో టీడీపీలో చేరతారన్న వదంతులు వినిపించాయి. అయితే తాజాగా వారిద్దరూ, తమ అనుచర వర్గంతో కలిసి బీజేపీలో చేరారు. కందుల సోదరుల చేరికతో ఈ జిల్లాలో బీజేపీ బలోపేతం కానుంది.

  • Loading...

More Telugu News