: జయలలితను కలిసిన అరుణ్ జైట్లీ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న కలిశారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడిన జయ సీఎం పదవిని కోల్పోవడమే కాకుండా, అనర్హత వేటుకు కూడా గురయిన సంగతి తెలిసిందే. జయ మాజీ అయిన తర్వాత కేంద్రం నుంచి ముఖ్యంగా బీజేపీ అగ్రనేతల్లో ఒకరు ఆమెను కలవడం ఇదే ప్రథమం. దీంతో, ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, రాజ్యసభలో కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు సహకరించాలని జయను జైట్లీ కోరినట్టు సమాచారం.