: ఏపీలో భారీగా ఐఏఎస్ లకు స్థానచలనం
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా అరుణ్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గా కోన శశిధర్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి.కోటేశ్వరరావు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా కె.సునీత, కార్మిక శాఖ కార్యదర్శిగా అనంతరాము, సెర్ఫ్ సీఈఓగా సాల్మన్ అరోకియ రాజ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ డైరక్టర్ గా కె.ధనుంజయరెడ్డి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కె. కన్నబాబు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా ఎల్ఎస్ బాలాజీరావు, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గా బి.రామాంజనేయులు, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా లవ్ అగర్వాల్, తుడా వైస్ చైర్మన్ గా వి.వినయ్ చంద్, సీసీఎల్ఏ కమిషనర్ గా అనిల్ చంద్ర పునేత, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జగదీశ్ చందర్ శర్మ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా షాలిని మిశ్రా నియమితులయ్యారు. ఇక, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విజయ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అనిల్ కుమార్, సాంకేతిక విద్య కమిషనర్ గా ఉదయలక్ష్మి, సాధారణ పరిపాలన శాఖ సెక్రటరీగా డి. కాడ్మియల్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీగా కె.రామ్ గోపాల్, నీటి పారుదల, సీఏడీ సెక్రటరీగా శశిభూషణ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శిగా బి.శ్రీధర్, కార్మిక శాఖ కమిషనర్ గా డి.వరప్రసాద్, మత్స్యశాఖ కమిషనర్ గా రామ్ శంకర్ నాయక్ నియమితులయ్యారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.