: కాంగ్రెస్, బీజేపీ వద్ద డబ్బులు తీసుకోండి... ఓటు మాత్రం మాకే వేయండి: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉత్తమ్ నగర్ నియోజకవర్గంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి డబ్బులు తీసుకోవాలని, ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయాలని పిలుపునిచ్చారు. వారిచ్చే ఆ నగదు ప్రజలనుంచి కొట్టేసిందేనని అన్నారు. అందుకే మొహమాటపడకుండా తీసుకోవాలన్నారు. అంతకుముందు, కేజ్రీవాల్ మరో సభలో మాట్లాడుతూ... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 7న పోలింగ్ జరగనుండగా, 10వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.