: కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వేలాదిగా నిలిచిపోయిన వాహనాలు
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాదు నగరం బయల్దేరారు. దీంతో, విజయవాడ-హైదరాబాదు రహదారిపై రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, జాతీయ రహదారిపై వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ మొత్తం 12 టోల్ గేట్లుండగా, ఒక్కో టోల్ గేట్ నుంచి బయటికొచ్చేందుకు రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు.