: ఢిల్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధిస్తాం: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ సాధించడం తథ్యమన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని అధికారికంగా ప్రకటించినట్టయితే పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ప్రత్యర్థిగా కిరణ్ బేడీని ప్రజలు అంగీకరించడం లేదన్నారు. కిందటిసారి తాము ప్రజలను వీడి వెళ్లామని, ఈ పర్యాయం అలా చేయబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 45 నుంచి 50 సీట్లు సాధిస్తామని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లున్నాయి.