: ఇంటికొకరు 'కూచిపూడి' నేర్చుకోవాలి: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా వేలివెన్ను ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటించారు. ఇంటికొకరు కూచిపూడి నృత్యం నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కార్యక్రమంలో భాగంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి వృద్ధులకు ఆర్థిక సాయం అందించారు. పాదయాత్ర పురస్కరించుకుని వేలివెన్నుకు మూడు బ్రిడ్జిలు మంజూరు చేశారు. వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లలో స్మార్ట్ రాష్ట్రంగా తయారవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News