: ఇక అన్ని జిల్లాల్లోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు: నారా లోకేశ్
ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను ఉభయ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. మొత్తం 23 జిల్లాల్లో ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ పేరిట అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ యూనివర్శిటీని నెలకొల్పుతామన్నారు. తిరుపతి, వరంగల్ లేదా, కరీంనగర్ లో బ్లడ్ బ్యాంకులు స్థాపించనున్నట్టు ఆయన తెలిపారు.