: చివర్లో టపటపా... ముగిసిన భారత ఇన్నింగ్స్!
చివరి ఓవర్లలో వికెట్లు వెంట వెంటనే పడిపోవడంతో ఆసీస్ తో మ్యాచ్ లో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 267 పరుగులతో సరిపెట్టుకుంది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ 138, రైనా 51 పరుగులతో రాణించారు. మిగిలిన వారిలో ఎవరూ 20 పరుగుల స్కోరును కూడా దాటలేకపోయారు. ఓ దశలో 236 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన జట్టు 25 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. మరికాసేపట్లో 268 పరుగుల విజయ లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభం కానుంది.