: దర్శకుడు శంకర్‌పై హిజ్రాల ధ్వజం


తమిళ దర్శకుడు శంకర్‌పై హిజ్రాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఐ' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ హిజ్రా పాత్రను నిజమైన హిజ్రా రాజాణితోనే నటింప చేశారు. ఈమె ప్రముఖ మోడల్ మాత్రమే కాకుండా ప్రముఖ నటీమణులు ఐశ్వర్యారాయ్ తదితరులకు ప్యాషన్ డిజైనర్ కూడా. ఐ చిత్రంలో విక్రమ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దే పాత్రలో నటించిన రాజాణి ఆయన్ని ప్రేమిస్తున్నట్లు, విక్రమ్ ఆమెను అసహ్యించుకున్నట్లు చిత్రీకరించడాన్ని హిజ్రాలు తప్పుబడుతున్నారు. దీంతో ఆమె మిగతా విలన్లతో కలసి హీరోను అంతం చేయాలన్న కుట్రలో పాలుపంచుకుంటుంది. ఈ సన్నివేశాలు తమను కించపరచేవిగా, మనోభావాలను దెబ్బతీసేలాగా వున్నాయని హిజ్రా సంఘం ఒక ప్రకటనలో ఆరోపించింది. సంఘంలో చిన్న చూపుతో పాటు, సినిమాల్లోనూ అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దర్శకుడు శంకర్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శంకర్ ఇంటి వద్ద బందోబస్తు పెంచారు.

  • Loading...

More Telugu News