: రాజ్ పథ్ పై విమాన విన్యాసాలు వద్దు... ఇండియాను కోరిన అమెరికా... కుదరదన్న కేంద్రం
రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు వేదికపై వుండే సమయంలో రాజ్ పథ్ రహదారిని విమానరహిత ప్రాంతం (నో ఫ్లై జోన్)గా ప్రకటించాలని ఆ దేశం కోరింది. దీన్ని గొంతెమ్మ కోరికగా అభివర్ణించిన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. రాజ్ పథ్ రహదారిని విమానరహిత ప్రాంతంగా ప్రకటిస్తే, వేడుకల సమయంలో యుద్ధ విమాన విన్యాసాలను రద్దు చేయాల్సి వుంటుంది. భారత వైమానిక శక్తి ప్రదర్శన లేకుండా ఒక్క రిపబ్లిక్ దినోత్సవం కూడా జరగలేదు. దీంతో, అమెరికా కోరికను మన్నించే సమస్యే లేదని కేంద్రం తెగేసి చెప్పినట్టు ప్రభుత్వాధికారి ఒకరు వివరించారు.