: కల్కి భగవాన్ ఆశ్రమాన్ని పేల్చివేసిన మావోయిస్టులు
విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గుదలం వీధిలోని కల్కి భగవాన్ ఆశ్రమాన్ని మావోయిస్టులు ఈ ఉదయం పేల్చి వేశారు. మావోయిస్టు నేత శంకర్ హత్య కేసులో ఆశ్రమ నిర్వాహకుడు సింహాచలం పాత్ర వుందని ఆరోపిస్తూ మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు. భక్తి ముసుగులో వీరు అరాచకాలు చేస్తున్నారని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.