: వాళ్లో రెండు, వీళ్లో రెండు నొక్కేశారు... జనాలు మొత్తుకుంటున్నారు!


పరిపాలకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చివరికి దాని ప్రభావం ప్రజలపైనే పడుతుంది. ప్రజలపై భారం తగ్గించి, మరింత సులభమైన జీవితాన్ని ఇస్తూ, వారివద్ద నాలుగు రూపాయలు మిగిలే అవకాశాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఇంతే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం! కోటి కాంతుల ఆశలతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలకు అందాల్సిన ఉపశమనాలను ప్రభుత్వం లాగేసుకుంటోంది. నిన్నటికి నిన్న పెట్రోలు ధరలు రూ.4.65 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించగా, ఆ వెంటనే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, టీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చెరో రూ.2 లాగేసుకున్నాయి. దీంతో రూ.63కు చేరాల్సిన లీటర్ పెట్రోల్ ధర రూ.67 పైనే ఆగిపోయింది. కాగా, తెలంగాణా ప్రభుత్వానికి ఈ రూ.2 వల్ల పెరిగే ఆదాయం ఎంతో తెలుసా? నెలకు కేవలం రూ.75 కోట్లేనట. మరి అంత తక్కువ మొత్తం కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై భారం మోపడం ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేమీ ఆదాయ మార్గాలు లేవా?

  • Loading...

More Telugu News