: ఏడు పదుల వయసులో పాతికేళ్ల పడుచును పెళ్ళాడిన మణిపూర్ మంత్రి


మణిపూర్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి ఫుంగ్‌ జథాంగ్ తోన్సింగ్ 77 ఏళ్ల వయస్సులో పెండ్లి పీటలు ఎక్కారు. తనకన్నా 53 ఏళ్లు చిన్నదైన యువతిని పెళ్లాడాడు. ఇంఫాల్‌ లోని ఇవాంజెలికల్ బాప్టిస్టు చర్చిలో జరిగిన వివాహ వేడుకలో మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రామ్ ఇబోబిసింగ్‌ తో పాటు, పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తోన్సింగ్ కుటుంబ సభ్యులందరూ రాష్ట్రం బయట నివసిస్తుండటంతో వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్నట్టు ఆయన చెబుతున్నారు.

  • Loading...

More Telugu News