: టికెట్ రద్దు చేసుకున్నా పెనాల్టీ వసూలు చేయబోము: జెట్ ఎయిర్‌ వేస్


కస్టమర్లు విమాన టికెట్టును బుక్ చేసుకున్న 24 గంటల్లోగా రద్దు చేసుకుంటే వారి నుంచి ఎలాంటి జరిమానా వసూలు చేయబోమని ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌ వేస్ ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంత వరకూ జెట్ ఎయిర్‌ వేస్ అంతర్జాతీయ ప్రయాణ టికెట్టును రద్దు చేసుకుంటే రూ.5,000, ప్రయాణ తేదీని మార్చుకుంటే రూ.3 వేలు జరిమానా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేశీయ ప్రయాణాల విషయంలో టికెట్టు రద్దు చేసుకున్నా, ప్రయాణ తేదీని మార్చుకున్నా రూ.1,750 వసూలు చేస్తోంది. ఈ నిబంధనలను సడలించడంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించినట్లయిందని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News