: పిజ్జా డెలివరీ చేసినందుకు లక్షా ముప్పై వేల రూపాయల టిప్పు


పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూసాడో ఏమో? ఆ పిజ్జా డెలివరీ బాయ్ ని అదృష్టం వరించింది. తన జీవితంలో చూడనంత బహుమతిని అందించింది. మిచిగాన్ లోని ఆన్ అర్బోర్ ప్రాంతంలో రాయ్ అనే డెలివరీ బాయ్ 'స్టాసే మెక్ వీ' తరపున కస్టమర్లకు పిజ్జాలను అందిస్తుంటాడు. కెల్లెర్ విల్లియమ్స్ అనే పేరున్న నిర్మాణ రంగ సంస్థ రీజినల్ కాన్ఫరెన్స్ ఆ ప్రాంతంలో జరిగింది. వారు కొన్ని పిజ్జాలను ఆర్డర్ ఇవ్వడంతో రాయ్ వాటిని తీసుకుని వెళ్లాడు. పిజ్జాలను అందించిన తరువాత వారిచ్చిన టిప్పు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఆ వెంటనే ఎంతో సంతోషించాడు. మొత్తం 2,084 డాలర్లను (సుమారు రూ.1.3 లక్షలు) వారు టిప్పు ఇచ్చారు. సేవా రంగంలో విధులు నిర్వహించే వారిపై తమ అభిమానాన్ని చూపేందుకే ఇంత టిప్పు ఇచ్చి ఉండవచ్చని రాయ్ పనిచేస్తున్న 'స్టాసే మెక్ వీ' ప్రతినిధి తెలిపారు. మంచి టిప్పుతో పాటు వీసా గిఫ్ట్ కార్డు, లాటరీ టికెట్లు, ప్రోత్సాహక లేఖను కూడా వారు ఇచ్చారట.

  • Loading...

More Telugu News