: బదౌన్ లో మరో ఘోరం... యువతిని పోలీస్ స్టేషను పైనుంచి తోసేసిన కానిస్టేబుల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ లో 17 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమెను పోలీస్ స్టేషను పై నుంచి తోసేసిన ఘటనలో ఒక కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనలో ఇంటర్ చదువుతున్న యువతికి తల, వెన్నెముక, నడుం ఎముకలు విరిగాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని బరేలీ ఆసుపత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు. ట్యూషన్ కు వెళ్ళిన తన కుమార్తెను ఉజానీ పోలీసుస్టేషను కానిస్టేబుల్ గౌరవ్ టైట్లర్ స్టేషనుకు తీసుకువెళ్ళాడని బాధితురాలి తల్లి ఆరోపించారు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు బాధితురాలు స్పృహలోకి వస్తే ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయాలని చూస్తున్నారు.