: 'ఎంఎస్ జీ' సినిమాను నిషేధించిన పంజాబ్ ప్రభుత్వం
వివాదాస్పద 'ద మెసెంజర్ ఆఫ్ గాడ్ (ఎంఎస్ జీ)' చిత్రాన్ని పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని పలుచోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో, ఈ సినిమా ప్రదర్శనను కొనసాగిస్తే, రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ క్రమంలో, రాష్ట్రంలో ఎక్కడా ఈ సినిమాను ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.