: భారత్ కు వ్యతిరేకంగా చైనాను ఉపయోగించుకున్న రాజపక్స: శ్రీలంక ప్రధాని విక్రమసింఘే
శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ అధ్యక్షుడు రాజపక్స హయాంలో మొదలైన చైనా-శ్రీలంక సంబంధాలను సమీక్షిస్తామని స్పష్టం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా చైనాను రాజపక్స వాడుకున్నారని, అలాగే చైనాకు వ్యతిరేకంగా భారత్ ను వాడుకునేందుకు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారని అన్నారు. రాజపక్స హయాంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల్లో చైనా పెట్టిన 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. విచారణలో ఎలాంటి అవినీతి బయటపడినా వదిలి పెట్టమని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారు చైనీయులు అయినా సరే, శ్రీలంక జాతీయులైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విక్రమసింఘే వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.