: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 18 కి.మీ. పాదయాత్ర చేస్తున్నా : చంద్రబాబు


టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని... తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా మిగిలిపోతారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 18 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నానని వెల్లడించారు. ప్రగతి కోసం చేసే ప్రజా ఉద్యమం ఇది అని ఆయన తెలిపారు. ఏపీని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తానని చెప్పారు. 2022 నాటికి ఇండియాలోనే ఏపీని ప్రథమ స్థానంలో నిలుపుతానని అన్నారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News