: మరో డబుల్స్ టైటిల్ సాధించిన లియాండర్ పేస్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఖాతాలో మరో డబుల్స్ టైటిల్ వచ్చి చేరింది. హెయినికన్ ఓపెన్ డబుల్స్ ను దక్షిణాఫ్రికా ఆటగాడు రావెన్ క్లాసెన్ తో కలసి పేస్ గెలుపొందాడు. ఫైనల్లో బ్రిటన్, రొమేనియా ఆటగాళ్లతో కూడిన జోడీని 7-6, 6-4తో వీరు ఓడించారు.