: కోటి విలువైన సీతారాముల విగ్రహాలు చోరీ
రూ. కోటి విలువైన సీతారాముల పురాతన విగ్రహాలు చోరీకి గురయ్యాయి. బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లాలోని ఓ ఆలయంలో ఈ చోరీ జరిగింది. ఈ ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులకు చోరీ జరిగిన సంగతి అర్థమైంది. దీంతో, జరిగిన ఘటనను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.