: శబరిమలలో గుండెపోటుతో మృతి చెందిన హైదరాబాద్ న్యాయవాది
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్ నగరానికి చెందిన న్యాయవాది కృష్ణవిజయ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన శబరిమలలో చోటు చేసుకుంది. మృతుడు కృష్ణవిజయ్ హైదరాబాదులోని బోయిన్ పల్లి ప్రాంతానికి చెందినవారు. ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే తోటి భక్తులు స్థానిక వైద్య శిబిరానికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు... అప్పటికే కృష్ణవిజయ్ మరణించారని ధ్రువీకరించారు. వార్త తెలిసిన కృష్ణవిజయ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.