: ఇషాంత్, జడేజా లేకుండా రేపటి వన్డే: ధోని


ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా రేపు ఆస్ట్రేలియాతో జరిగే క్రికెట్ పోటీకి ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు అందుబాటులో ఉండరని భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. ప్రస్తుతానికి తన దృష్టంతా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లతో జరిగే సిరీస్ మీదే ఉందని ఆయన అన్నాడు. గడచిన టెస్టు సిరీస్ పరాజయాన్ని పక్కనబెట్టి, వన్డే పోటీల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై తాను ఆలోచిస్తున్నానని, కొత్త కాంబినేషన్‌ లను తయారుచేసి ఇక్కడి పిచ్ లపై ప్రయోగాలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. రానున్న ప్రపంచకప్‌ ముందు ఆటగాళ్లకు మరింత అనుభవం వచ్చేందుకు ఈ పోటీలను వాడుకుంటామని తెలిపాడు. స్టువర్ట్ బిన్నీపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ, బిన్నీ 'బెస్ట్ సీమ్ ఆల్ రౌండర్' అని పొగిడాడు.

  • Loading...

More Telugu News