: అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం మానుకో: కేసీఆర్ పై నాగం ఫైర్


తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన పాలమూరు జిల్లాను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నాగర్ కర్నూలు మండలం గుడిపల్లి గట్టు వద్ద నాగం జనార్ధన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకో అబద్ధం చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని కేసీఆర్ కు సూచించారు. మంత్రులు కూడా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News