: రికార్డింగ్ డాన్సర్లతో స్టెప్పులేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే... హల్ చల్ చేస్తున్న వీడియో


మిన్నంటిన పండుగ సంబరాల్లో ప్రజా ప్రతినిధులు దగ్గరుండి పాలుపంచుకోవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేశాడు. ఏకంగా స్టేజి ఎక్కి రికార్డింగ్ డాన్సర్లతో కలసి స్టెప్పులేశాడు. ఆయన ఎవరో తెలుసా... తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి. సంక్రాంతి సందర్భంగా పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులో 'నీ ఇల్లు బంగారం కాను.. నా ఒళ్లు సింగారం కాను' అంటూ అమ్మాయిలతో చేతులు కలిపి డాన్సులు చేశారు. ఆయన డాన్సు చేస్తుండగా ఎవరో వీడియో కూడా తీశారు. ఇప్పుడా వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News