: యంగ్, డైనమిక్, డెడికేటేడ్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటేడ్, డిసిప్లిన్, డైనమిజమ్, డివోషన్... స్మృతి ఇరానీపై వెంకయ్య పొగడ్తలు


ఆంధ్రప్రదేశ్ లో ఐఐఎం శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. యంగ్, డైనమిక్, డెడికేటేడ్, కారెక్టర్, క్యాలిబర్, కెపాసిటేడ్, డిసిప్లిన్, డైనమిజమ్, డివోషన్... అంటూ మొదలు పెట్టి ఆమె సమర్థతలను పొగిడారు. ఓర్పుతో, నేర్పుతో, మార్పుతో, చేర్పుతో... ఆమె ఎంతో హుందాగా వ్యవహరిస్తారని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాలని కోరగానే ఆమె అంగీకరించారని, అందుకు కృతజ్ఞతలని తెలిపారు. వెంకయ్య మాట్లాడిన వేగానికి ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియక సభావేదికపై వున్న పెద్దలు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు. స్మృతి ఇరానీ ఏకంగా ఆయన మాటలకు అర్థం చెప్పాలని పక్కనున్న వారిని కోరారట. మరి వెంకయ్య వాగ్ధాటా... మజాకా!

  • Loading...

More Telugu News