: మక్కాలో మహిళపై బహిరంగ శిరచ్ఛేదన శిక్ష అమలు చేసిన ప్రభుత్వం
తన సవతి కూతురుని చంపిందన్న అభియోగాలతో, ఓ మహిళను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా తలనరికి చంపింది సౌదీ అరేబియా ప్రభుత్వం. అంతకుముందు ఆమెను తాళ్ళతో కట్టి పవిత్ర నగరం మక్కా వీధుల్లో ఈడ్చుకుంటూ లాక్కొచారు. లైలా అబ్దుల్ ముతలీబ్ అనే పేరున్న ఆమె "నేను చంపలేదు... నేను చంపలేదు" అని వేడుకొంది. ఆమె గోడు పట్టించుకోని అధికారులు పదునైన కత్తితో మూడుసార్లు మేడపై నరికి శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరించి యూట్యూబ్ లో ఉంచారు. కాగా, గత రెండు వారాల వ్యవధిలో సౌదీ ప్రభుత్వం 10 మందికి మరణ శిక్షలను అమలు చేసింది.