: రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంకయ్య ఒంటరి పోరు: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఒంటరి పోరు సాగించారని ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఐఐఎం శంకుస్థాపన కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మంత్రి గంటా, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంకయ్య చేసిన కృషిని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, కాంగ్రెస్ సర్కారుపై ఒంటరి పోరు సాగించిన వెంకయ్య రాష్ట్రానికి పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను సాధించిపెట్టారన్నారు.