: సల్మాన్ ఫేస్ బుక్ ఫాలోయర్లు రెండు వందల మంది... జాబితాలో వివిధ రాష్ట్రాల యువకులు!


ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళుతూ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ సల్మాన్ మోయినుద్దీన్ కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. అమెరికాలో ఉండగానే నకిలీ పేర్లతో ఫేస్ బుక్ లో ఖాతాలు ఓపెన్ చేసిన సల్మాన్ ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగించాడు. అయితే వీసా నిరాకరణ నేపథ్యంలో హైదరాబాదు వచ్చిన సల్మాన్ ఇక్కడ మూడు నెలల పాటు ఉన్నాడు. ఈ కాలంలో అతడు ఫేస్ బుక్ ద్వారా పెద్ద సంఖ్యలో యువతను ఐఎస్ వైపు ఆకర్షించేందుకు యత్నించాడు. అతడి యత్నాలు కొంతమేర ఫలించాయనే చెప్పాలి. నిన్న అతడు అరెస్టయ్యే సమయానికి అతడి ఫేస్ బుక్ ఖాతాలో 188 మంది ఫాలోయర్లున్నారు. వీరిలో ఒక్క హైదరాబాదుకు చెందినవారే కాక వివిధ రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సల్మాన్ ఫేస్ బుక్ ఫాలోయర్లలో ఎవరైనా ఐఎస్ఐఎస్ చేరారా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News