: కాక్ పిట్ లో ఫైట్... చెన్నైలో ఎగరకుండా నిలిచిన ఎయిర్ ఇండియా విమానం!


చెన్నై విమానాశ్రయం నుంచి కొద్దిసేపట్లో నింగికెగరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎంతసేపటికి టేకాఫ్ తీసుకోలేదు. విమానంలో సాంకేతిక లోపం లేదు. ప్రతికూల వాతావరణం అంతకన్నా లేదు. మరి విమానం ఎందుకు ఎగరలేదనుకుంటున్నారా? విమానం కాక్ పిట్ లో భారీ ఫైటింగ్ జరిగింది. ఈ ఫైటింగ్ కారణంగానే ఆ విమానం ఎగరకుండా నిలిచిపోయింది. కాక్ పిట్ లో విమానం పైలట్, ఇంజినీర్ లు ఒకరిపై ఒకరు ముష్ఠి ఘాతాలు విసురుకున్నారు. ఈ ఫైటింగులో ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడ్డ ఇంజినీర్ ను సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, పైలట్ దాడిలో తమ విభాగానికి చెందిన సభ్యుడు గాయాలపాలు కావడంతో ఎయిర్ ఇండియా ఇంజినీర్లు ఆందోళనకు దిగారు. దీంతో ఫైట్ జరిగిన కాక్ పిట్ లోనే పైలట్, తనను తాను నిర్బంధించుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పైలట్ ను కాక్ పిట్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు విమానయాన శాఖాధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News